IPL 2025 : బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే టాటా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) మెగా టోర్నీ ఈ ఏడాదిలో నిర్వహించేందుకు సిద్దమైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. తొలి మ్యాచ్ కు వేదిక కానుంది కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్. మొత్తం 10 ఫ్రాంచైజీలకు సంబంధించిన జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నాయి. ఈసారి దుబాయ్ వేదికగా గత ఏడాది ఐపీఎల్(IPL 2025) వేలం పాట కొనసాగింది.
IPL 2025 Updates
అందరి దృష్టి ఇప్పుడు అందరికంటే అత్యంత చిన్న వయసు కలిగిన వైభవ్ సూర్యవంశీపై నెలకొంది. తన వయసు కేవలం 13 ఏళ్లే. ఈ కుర్రాడిని ఏరికోరి ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్. హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ తనను ఎంచుకున్నాడు.
ఇక ఐపీఎల్ టోర్నీ విషయానికి వస్తే ఈ మెగా టోర్నమెంట్ లో మొత్తం 10 జట్లు పాల్గొనేందుకు సిద్దమయ్యాయి. మొత్తం 2 నెలల పాటు టోర్నీ కొనసాగుతోంది. భారీ ఎత్తున బెట్టింగ్ లు జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడనున్నాయి.
మార్చి 22న తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది తమ స్వంత వేదిక ద్వారా. సినీ రంగానికి చెందిన ప్రముఖ నటీ నటులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారనున్నారు.
Also Read : Hero Sethupathi-Puri Jagannath :పూరీ కమ్ బ్యాక్ ‘బెగ్గర్’ కన్ ఫర్మ్