War 2 : దేవర మూవీతో ఇటు టాలీవుడ్ ను అటు బాలీవుడ్ ను షేక్ చేశాడు రైజింగ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఇందులో జాన్వీ కపూర్ కీ రోల్ పోషించింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. దీనికి సంబంధించి సీక్వెల్ కూడా రానుంది. ఇదే సమయంలో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. తొలిసారిగా హిందీ చిత్రంలో ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఇండియన్ స్టార్ హీరో గా గుర్తింపు పొందిన హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ -2లో ముఖ్య భూమిక పోషించాడు.
Jr NTR-War 2 Movie Updates
తన వరకు 20 నిమిషాల పాటు చొక్కా లేకుండా తన పర్ ఫార్మెన్స్ చూపించ బోతున్నట్లు టాక్. బాలీవుడ్ లో వార్ 2(War 2) కోసం అత్యంత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అభిమానులు. పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందించే పనిలో పడ్డాడు దర్శకుడు. సిక్స్ ప్యాక్ బాడీతో అలరించనున్నాడు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉండనున్నట్లు టాక్. ఈ హై ఓల్టేజ్ సీన్స్ మూవీకి హైలెట్ గా నిలుస్తాయని దర్శకుడు పేర్కొంటున్నారు. వార్ -2ను ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండేలా జాగ్రత్త పడుతున్నారని వినికిడి.
ఎన్టీఆర్ ఇప్పటికే తాను అద్భుతమైన నటుడినని నిరూపించుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ ఏకంగా ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది. ఇదే సమయంలో పూర్తి ఫిట్ నెస్ ను కంటిన్యూ చేస్తూ వస్తున్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఇప్పుడు రాబోయే వార్ 2 లో కళ్లు చెదిరేలా పోరాట సన్నివేశాలు ఉండ బోతున్నాయని, తను పూర్తిగా చొక్కా లేకుండా నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ట్రైలర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.
Also Read : Hero Vijay Deverakonda-Pushpa 3 :బన్నీ సుకుమార్ పుష్ప-3లో దేవరకొండ..?