Odela 2 : మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటీ కీ రోల్ పోషిస్తున్న చిత్రం ఓదెల 2(Odela 2) . ఇందులో నాగ సాధువు పాత్రలో నటిస్తోంది. ఓటీటీలో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ కి ఇది సీక్వెల్ గా రానుంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీశాడు దర్శకుడు అశోక్ తేజ. డి. మధు నిర్మించారు. సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందించారు. ఇందులో భాగంగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 17వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Tamannaah-Odela 2 Movie Updates
ఈ సినిమా పూర్తిగా ప్యాన్ ఇండియాగా రూపొందించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు. ఓదెల 2ను కాశీలో ప్రారంభించామని, టీజర్ ను కుంభమేళాలో విడుదల చేశామన్నారు. ప్రస్తుతం ట్రైలర్ ని ముంబైలో విడుదల చేయమున్నామని ప్రకటించారు. ఈనెల 8వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని తెలిపారు.
తమన్నా భాటియా నటించిన ఓదెల 2 మూవీకి సంబంధించి తెలుగు, హిందీ ట్రైలర్ లను ఇదే వేదికపై రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహాతో పాటు హెబ్బా పాటిల్ కీ రోల్స్ పోషించారు. వీరితో పాటు నాగ మహేశ్,, వంశీ, గగన్ విహారీ, సురేందర్ రెడ్డి, నాగ మహేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Dear Uma Movie- Love Story :’డియర్ ఉమ’ అందమైన ప్రేమకథ