Mandakini OTT : ఓటీటీలోకి రానున్న తమిళ కామెడీ థ్రిల్లర్ ‘మందాకినీ’

తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి...

Hello Telugu - Mandakini OTT

Mandakini : ఇటీవల మలయాళం సినిమాలకు ఇప్పుడు ఆదరణ ఎక్కువగానే లభిస్తుంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్ కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషలలోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరో కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయిపోయింది. అదే మందాకిని(Mandakini). ఈ ఏడాదిలో మలయాళంలో చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది. కామెడియన్ అల్తాఫ్ సలీమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు వినోద్ లీలా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలు అల్తాఫ్ సలీమ్ సరసన అనార్కలి మరిక్కర్ కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన మందాకిని(Mandakini).. థియేటర్లలో కమర్షియల్ హిట్ గా నిలిచింది.

Mandakini OTT Updates

తొలి రోజే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే కథ, కామెడీతోపాటు లీడ్ యాక్టర్స్ యాక్టింగ్ బాగుందంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు అడియన్స్. మరోవైపు ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. కేవలం మలయాళంలోనే రూ.5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఇన్నాళ్లు థియేటర్లలలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. మనోరమా మాక్స్ ఓటీటీలో ఈ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. త్వరలోనే రెండో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ ప్రకటన రానున్నట్లు టాక్.

(అల్తాఫ్ సలీమ్) అరోమల్ అనే పాత్రలో నటించగా.. అంబిలికి (అనార్కలి మరిక్కర్)గా కనిపించింది. వీరిద్దరికి పెద్దలు పెళ్లి జరిపించగా.. ఫస్ట్ నైట్ రోజే అరోమల్ ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ లో మద్యం కలిపి అతడి చేత సీక్రెట్ గా తాగించాలని ప్లాన్ చేస్తారు. కానీ అదే కూల్ డ్రింక్ ను అనుకోకుండా అంబిలి తాగేస్తుంది. ఇక అదే మత్తులో తన లవ్ ఎఫైర్ గురించి భర్తకు చెప్పడంతో..ప్రేమ పేరుతో తనను ఓ వ్యక్తి మోసం చేశాడని చెప్పడంతో అరోమల్ షాకవుతాడు. ఆ తర్వాత తన భార్యకు ఎలాంటి న్యాయం చేశాడు..? అసలు అంబిలిని మోసం చేసిన వ్యక్తి ఎవరు అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Also Read : Devi Sri Prasad : హైదరాబాద్ లో లైవ్ షో ఏర్పాటు చేసిన రాక్ స్టార్ దేవి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com