బుల్లి తెరపై సెన్సేషన్ రియాల్టీ షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్. ఇటు తెలుగులో అటు హిందీలో మరో వైపు తమిళం, తదితర ఇతర భాషల్లో దూసుకు పోతోంది. తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయవంతంగా 7వ ఎపిసోడ్ కొనసాగుతోంది.
తాజాగా తమిళ బుల్లితెరకు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ఈసారి తమిళం బిగ్ బాస్ రియాల్టీ షో 7 కు సంబంధించి హోస్ట్ గా లోక నాయకుడిగా ప్రసిద్ది చెందిన దిగ్గజ నటుడు కమల్ హాసన్ చేయనున్నారు. ఇందులో ఎవరు పాల్గొంటారనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు నిర్వాహకులు.
మొత్తం 18మంది పార్టిసిపెంట్స్ ను ప్రకటించింది సంస్థ. స్టార్ టీవీ దీనిని హోస్ట్ చేస్తోంది. లోక నాయకుడు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారనున్నారు. ఆయనతో పాటు కూల్ సురేష్ , పూర్ణిమ రవి, రవీనా దహా, ప్రదీప్ ఆంటోనీ, నిక్సెన్ , వినుషా దేవి, మణిచంద్ర, అక్షయ్ ఉదయ్ కుమార్ ఉన్నారు.
ఐషు యాడ్స్ , జోవిక విజయ్ కుమార్, విష్ణు విజయ్ , మాయ ఎస్ కృష్ణన్ , శరవణన్ విక్రమ్ , యుగేంద్రన్ , విచిత్ర , బావ చెల్లదురై , అనన్య ఎస్ రావు, విజయ్ వర్మ ఇందులో కంటెస్టెంట్స్ గా ఉన్నారు. మొత్తంగా ఈసారి బిగ్ బాస్ షోకు సంబంధించి రేటింగ్స్ ఎవరికి వస్తాయనే దానిపై వేచి చూడాలి.