Meghali Meenakshi : నిర్బోయ అనే బెంగాలీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుని తమిళంలో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన నటి మేఘాలి మీనాక్షి జాక్ పాట్ కొట్టింది. కోలీవుడ్‌లో ఏకంగా హీరోయిన్‌గా అవకాశాన్ని దక్కించుకుంది. సీనియర్ దర్శక నటుడు పార్తిబన్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన వెంకట్ జాన్ కథ సమకూర్చి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విఠల్ రావ్ కదివరణ్, పుగుపేట సురేష్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు.
Meghali Meenakshi Movies..
ఈ సినిమా గురించి దర్శకుడు వివరిస్తూ, ‘సాధారణంగా వీధిలో కిరాణా షాపు నడిపే వ్యక్తి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదుర్కొనే సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని హృదయాన్ని టచ్ చేసేలా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఈ సినిమా స్క్రీన్ ప్లే కొనసాగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అలాగే సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ కథాంశం ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Also Read : Siva Balaji: యూట్యూబర్‌పై కేసు పెట్టిన శివబాలాజీ !