Odela 2 : తమన్నా భాటియా గతంలో పోషించిన రోల్స్ కు భిన్నంగా పూర్తిగా నాగ సాధువు పాత్రను పోషించింది ఓదెల 2 మూవీలో. ఇందుకు సంబంధించి ట్రైలర్ ను ముంబైలో జరిగిన కార్యక్రమంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. కాగా అశోక్ తేజ ఓదెల 2(Odela 2) కు దర్శకత్వం వహించారు. అంతకు ముందు విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సమయంలో సినిమా షూటింగ్ ను ఆ మధ్య కుంభ మేళాలో చిత్రీకరించారు.
Tamannaah-Odela 2 Movie Updates
తాజాగా విడుదలైన ఓదెల 2 ట్రైలర్ సూపర్ గా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. భరత ఖండాన దక్షిణ గంగా తీరానా ఆ పరమాత్ముడు పుట్టిల్లైన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటుంది. ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తుంది అనే పవర్ ఫుల్ డైలాగ్ మరింత అందాన్ని ఇచ్చేలా చేసింది. చిత్రీకరణ కెవ్వు కేక అనిపించేలా చేసింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించింది తమన్నా భాటియా.
ఇందులో ప్రతి నాయకుడిని అంతం చేసేందుకు వచ్చిందే తను. పంచాక్షరి అనే ఆయుధంతో పరమాత్ముడు పంపిన దూతగా అఘోరీగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా. ఇదే సమయంలో సినిమాకు హైలెట్ గా నిలిచింది మరో కీలకమైన డైలాగ్. అదేమిటంటే మనం బతకాలంటే భూమాత కావాలి. హాయిగా జీవించాలంటే గోమాత కావాలి అని. ఇది హిట్ గా నిలిచింది. రజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా ఓదెల్ 2 మూవీ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చిట్ చాట్ సందర్బంగా తమన్నా భాటియా తన మాజీ ప్రియుడి గురించి దాటవేసింది.
Also Read : Hero Sharwanand-Darshaname :అంతటా ‘దర్శనమే’ ఆనందమే