Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మడు అటు మూవీస్ తో ఇటు వెబ్ సీరీస్ తో బిజీగా ఉంది. అయితే తను ఫ్యాషన్ షోస్ లో కూడా తళుక్కున మెరుస్తోంది. ఈ సందర్బంగా సినిమాల కంటే ఫ్యాషన్ అంటేనే తనకు పేషన్ అని స్పష్టం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే తన ప్రియుడు విజయ్ వర్మతో విడి పోతున్నట్లు ప్రకటించింది. ఎక్కువ కాలం ఉండలేమంటూ పేర్కొంది. ఈ తరుణంలో తాజాగా ఫ్యాషన్ రంగంపై చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Tamannaah Bhatia Shocking Comments
బలంగా భావిస్తున్న దానిని బయట పెట్టేందుకు ఫ్యాషన్ మార్గంగా తనకు లభించిందని చెప్పింది. ఇందులో ఎక్కువగా మనకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ప్రతి నిత్యం మనలో ఎనలేని భావాలు కలుగుతుంటాయి. ఆలోచనల పరంపర కొనసాగుతూ వస్తుంటుంది. ఈ సమయంలో మనకంటూ నిర్ణయం తీసుకునేందుకు ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అయితే సినిమాలలో కేవలం దర్శకుడు చెప్పిందే వేదం. తను ఎలా చెబితే మనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకే పరిమితం అవుతామని తెలిపింది. కానీ ఫ్యాషన్ షోస్ లో అలా కాదు. మనకు ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది.
మొత్తంగా నటీనటులకు, సినిమా, మోడలింగ్, ఇతర రంగాలకు చెందిన వారికి త్వరగా గుర్తింపు రావాలన్నా లేదా మన ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా ఉండాలని అనుకున్నా కావాల్సింది ఏమిటంటే ఈ ఫ్యాషన్ రంగమే మంచి మార్గమని అభిప్రాయ పడింది లవ్లీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah). గత 20 ఏళ్లుగా సినీ రంగంలో కొనసాగుతూ వచ్చాను. కానీ భిన్నంగా నాకు ఎక్కువగా ఫీల్ ఫ్రీగా ఉన్నది మాత్రం ఫ్యాషన్ పరిశ్రమనేనని కుండ బద్దలు కొట్టింది తమన్నా భాటియా.
Also Read : Hero Chiranjeevi : మెగాస్టార్ కు జీవిత సాఫల్య పురస్కారం