Tamannaah Bhatia: తెలుగులో పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లలో మిల్కీ బ్యూటీ తమ్మన్నా భాటియా ఒకరు. చిన్ని చిన్న సినిమాలో కెరీర్ ను ప్రారంభించి… టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం టాప్ హీరోయిన్ గా ఎదిగింది తమన్నా. శ్రీ, హ్యాపీడేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఆవారా వంటి చిన్న సినిమాలతో కెరీర్ ను స్టార్ట్ చేసి… రచ్చ, ఊసరవెళ్ళి, బద్రీనాధ్, రెబల్, కెమరామెన్ గంగతో రాంబాబు, బాహుబలి, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలతో దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కూడా నటించింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ సినిమాలో కూడా నటించడంతో పాటు పలు వెబ్ సిరీసుల్లో నటిస్తూ ఓటీటీల్లో కూడా సందడి చేస్తుంది.
తెలుగు, తమిళ, హిందీ అని తేడా లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగి బిజీ బిజీగా గడుపుతున్న తమన్నా(Tamannaah Bhatia)… ఒక్కసారిగా డివోషనల్ మోడ్ లోనికి వెళ్ళిపోయింది. తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ముఖమంతా కుంకుమ పూసుకుని పూలమాలతో చేతిలో పూజా సామగ్రి పెట్టుకుని కామాఖ్య ఆలయంలో ఉన్న తమన్నా ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Tamannaah Bhatia – పెళ్ళి కోసమేనా తీర్థ యాత్రలు ?
అయితే తమన్నా ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలడం వెనుక బలమైన కారణమున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతుండంతో కుటుంబం ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళారని త్వరలోనే ఆ శుభవార్తను ఈ మిల్కీ బ్యూటీ చెప్తుందని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా చాలాకాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని తమన్నానే స్వయంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో విజయ్ వర్మతోనే తమన్నా పెళ్ళి జరుగుతుందా అనేది తెలియాలంటే తమన్నా నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.
Also Read : Bobby Deol: క్రూరమైన ఉధిరన్ గా బాబీ డియోల్ ఫస్ట్ లుక్ !