Tamannaah Bhatia: మరో ఐటెం సాంగ్ కు మిల్క్ బ్యూటీ రెడీ

మరో ఐటెం సాంగ్ కు మిల్క్ బ్యూటీ రెడీ

Hello Telugu - Tamannaah Bhatia

Tamannaah Bhatia : ‘వా.. నువ్వు కావాలయ్యా’ అంటూ రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో తన స్టెప్పులతో కుర్రకారుల్ని ఉర్రూతలూగించిన మిల్క్ బ్యూటీ తమన్నా(Tamannaah Bhatia)… మరో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతోంది. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా హిందీలో తెరకెక్కిస్తున్న ‘స్త్రీ 2’ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ కు ఓకే చేసినట్లు తెలుస్తోంది. జైలర్ సినిమాలో ‘వా.. నువ్వు కావాలయ్యా’ థీమ్ తో తెరకెక్కిస్తున్న ఈ పాటకు తమన్నా అయితే ఫెర్ ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావించిందట… ఈ నేపథ్యంలోనే ఆ పాట షూటింగ్ ను కూడా శరవేగంగా జరుపుతోందని సమాచారం. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Tamannaah Bhatia another Item Song Coming Soon

‘శ్రీ’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మిల్క్ బ్యూటీ తమన్నా… తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వంటి బడా స్టార్లతో పాటు రామ్, కార్తీ, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి యువ హీరోలతో కూడా సినిమాల్లో నటించింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇటీవల రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన ‘జైలర్‌’ సినిమాలో కేమియో రోల్ లో కనిపించిన మిల్క్ బ్యూటీ… ‘వా.. నువ్వు కావాలయ్యా’ అనే స్పెషల్ సాంగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నిర్మాతలు ‘స్త్రీ 2’లో స్పెషల్ సాంగ్ కు తమన్నాను ఎంగేజ్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Hero Jr NTR: త్వరలో ప్రారంభం కానున్న ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com