Tamannaah Bhatia: ‘పంచుకో’ అంటూ అందాలు ఆరబోస్తున్న మిల్క్ బ్యూటీలు !

‘పంచుకో’ అంటూ అందాలు ఆరబోస్తున్న మిల్క్ బ్యూటీలు !

Hello Telugu - Tamannaah Bhatia

Tamannaah Bhatia: తెరపై ఒక కథానాయిక కనిపిస్తోందంటే చాలు… కళ్లన్నీ ఆమెపైకే వెళ్తాయి. అలాంటిది ఇద్దరు మిల్క్ బ్యూటీలు పోటీ పడి అందాలు ఆరబోస్తే… రెండు కళ్ళు చూడటానికి సరిపోవు. తమ అంద చందాలతోపాటు కుర్రకారును హుషారెత్తించే డ్యాన్సులతో ‘పంచుకో…’ అంటూ థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నారు మిల్క్ బ్యూటీలు తమన్నా(Tamannaah Bhatia), రాశీ ఖన్నా. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘బాక్‌’ సినిమాలో ఈ ఇద్దరు మిల్క్ బ్యూటీలు అభిమానులను అలరించడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా నుండి ‘పంచుకో…’ అనే ప్రోమో సాంగ్ ను విడుదల చేసింది. ఈ పాటను సాహితీ రచించగా, రాఘవి ఆలపించారు. హిప్‌ హాప్‌ తమిళ స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారుతోంది.

Tamannaah Bhatia Viral

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన క్రేజీ సీరీస్ ‘అరణ్మనై’. హారర్‌ కామెడీ జానర్లో తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ దక్కించుకున్న ఈ సిరీస్ నుండి దర్శకుడు సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా ‘బాక్‌’ పేరుతో ‘అరణ్మనై-4’ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను… ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి సంస్థ ద్వారా ఈ నెలలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హారర్‌ కామెడీ కథతో రూపొందిన ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, శ్రీనివాసులు, ఢిల్లీ గణేశ్‌, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో ‘బాక్‌’ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్, ప్రోమో సాంగ్ లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

‘అరణ్మనై’ ఫ్రాంచైజీ దాదాపు పదేళ్ల క్రితం మొదలైంది. 2014లో విడుదలైన ‘అరణ్మనై’ సూపర్‌హిట్ అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా ‘అరణ్మనై 2’ తెరకెక్కించారు సుందర్‌. 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2021లో ‘అరణ్మనై 3’ విడుదలైంది. రాశీఖన్నా, ఆర్య, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ‘అరణ్మనై 4’ ను ‘బాక్’ పేరుతో దర్శకుడు సుందర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ… డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో… నిర్మాతల సూచన మేరకు దర్శకుడు సుందర్ హీరోగా నటిస్తున్నారు.

Also Read : Apoorva Srinivasan: రహస్యంగా పెళ్లి చేసుకున్న ‘టెంపర్’ బ్యూటీ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com