Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం తన నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి బిగ్ షాక్ ఇచ్చింది. లవర్ విజయ్ వర్మ నుంచి తాను ఉండలేనంటూ చెప్పేసింది. ఇక లవ్ లేదంటూ ప్రకటించింది. తనతో విడి పోతున్నట్లు ప్రకటించాక తనకు బంపర్ ఆఫర్ వచ్చింది. అదేమిటంటే కొత్త సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది.
Tamannaah New Movie with Ajay Devgan
విచిత్రం ఏమిటంటే తమన్నా భాటియా(Tamannaah) ఈ ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఏమైందో ఏమో కానీ లవర్ నుంచి ఆశించిన మేర స్పందన రాలేదు. దీంతో తనకు కోపం వచ్చింది. వెంటనే బ్రేకప్ చెబుతున్నట్లు ప్రకటించింది. అందరినీ విస్తు పోయేలా చేసింది. తనతో తాను హాయిగా ఉండలేనంటూ పేర్కొంది తమన్నా భాటియా.
మళ్లీ ఒక్కటి అవుదాం..మనిద్దరం కలిసి నడుద్దాం అంటూ విజయ్ వర్మ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించింది ఈ లవ్లీ బ్యూటీ. డోంట్ కేర్ అంటూ షాక్ ఇచ్చింది. ఇక నుంచి సినీ కెరీర్ పై ఫోకస్ పెడతానంటూ ప్రకటించింది. ఆ వెంటనే ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో కలిసి నటించేందుకు గాను కొత్త సినిమాకు సంతకం చేసింది. ఇదంతా విడి పోవడం వల్లనే తనకు ఛాన్స్ వచ్చిందంటూ పేర్కొనడం విశేషం.
Also Read : Hero Ram Charan-Sharukh :బాద్ షాతో జత కట్టనున్న చెర్రీ..?