Tamannaah : సినిమా అనేది రంగుల లోకం. ఎవరు ఎప్పుడు కలుస్తారో ఇంకెప్పుడు విడి పోతారో చెప్పలేం. సినిమాలలో పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్లి పోతుంటాయి. ఇప్పుడు బంధాలు కూడా దారాలకంటే మరింత పలుచనై పోయాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి సినీ సెలిబ్రిటీలు నిత్యం తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. ఆపై తమ ప్రచారం కోసం ఎంతగానో కష్టపడతారు. కానీ అది వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేయరు.
Tamannaah Breakup with her Boyfriend
గత కొంత కాలంగా సినీ రంగానికి సంబంధించి ఎక్కువగా ప్రచారంలో ఉన్నది లవ్లీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah), విజయ్ వర్మ. వీరిద్దరూ చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగారు. కబుర్లు చెప్పుకున్నారు. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా అంతర్గత ఫోటోలు కూడా పంచుకున్నారు. ఆపై ముద్దులు కూడా పెట్టుకున్నారు. తమ బంధం ఎల్లప్పటికీ ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు. కానీ తీరా చూస్తే అభిమానులకు షాక్ ఇచ్చారు ఇద్దరూ.
తామిద్దరం పీకల లోతు ప్రేమలో కూరుకు పోయామని, కానీ విజయ్ వర్మతో తాను సరిగా ఉండలేక పోతున్నానని, అందుకే తనతో ఉండాలని అనిపించడం లేదంటూ బాంబు పేల్చింది తమన్నా భాటియా. చాన్నాళ్ల తర్వాత బ్రేక్ అప్ చెబుతున్నట్లు ప్రకటించింది. ఎంతైనా తమన్నా మజాకా అంటున్నారు తెలిసిన వారు.
Also Read : Champions Trophy 2025 Final :ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు భారత్