ఓటీటీలు వచ్చేశాక సీన్ మారింది. సితార కూడా మారి పోతోంది. టాప్ హీరోయిన్లు సైతం దేనికైనా రెడీ అంటున్నారు. 1990 నుంచి 2000 దాకా ఒక దశాబ్దం పాటు టాప్ హీరోగా నిలిచిన కాజోల్ సైతం హద్దులు చెరిపేసింది. ఏకంగా వెబ్ సీరీస్ లో రెచ్చి పోయి నటించింది. బెడ్ సీన్ తో పాటు కిస్సులతో పరేషాన్ చేసింది.
ఇక లస్ట్ సీరీస్ పేరుతో రూపొందించిన వెబ్ సీరీస్ కు భారీ ఎత్తున ఆదరణ లభించింది. కారణం మోతాదు మించి సెక్స్ సీన్స్ ఉండడం మరింత హాట్ టాపిక్ గా మారేలా చేసింది. తాజాగా ఇదే వెబ్ సీరీస్ కు సీక్వెల్ గా లస్ట్ సోరీస్ 2 వస్తోంది. దీనికి సంబంధించి ఘాటు కామెంట్స్ తో రెచ్చి పోయింది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.
గతంలో నటించిన చిత్రాలలో కాస్తంత పద్దతిగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి గేర్ మార్చేశారు. హాట్ సీన్స్ కు తెర తీశారు. నాలుగు గోడలకే పరిమితం కావాల్సిన సీన్స్ లలో లీనమై నటించింది ఈ ముద్దుగుమ్మ. తన లవర్ విజయ్ వర్మతో కలిసి నటించానని, అయినా సెక్స్ అంటే ఇష్టంగా ఉండాలని కానీ అదేదో పాపమై పోయినట్లు ప్రవర్తిస్తే ఎలా అంటూ ప్రశ్నించింది.
దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇంకెంత బరి తెగించి నటిస్తుందో వేచి చూడాలి.