Taapsee Pannu : బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తీవ్రంగా స్పందించింది. తన గురించి వివాదాస్పద నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఇది మంచి పద్దతి కాదని సూచించింది. తాను ఆరోగ్యకరమైన విమర్శలను స్వీకరించేందుకు సిద్దంగా ఉంటానని స్పష్టం చేసింది. విచిత్రం ఏమిటంటే తన సోదరి కంగనాను చూసి మక్కీకి మక్కి కాపీ కొడుతోందంటూ తాప్సీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దీనిపై చిట్ చాట్ సందర్బంగా తాప్సీ పన్ను(Taapsee Pannu) తన అభిప్రాయం చెప్పింది.
Taapsee Pannu Serious Comments Kangana’s Sister Rangoli
తను ఎందుకు అలా తనను టార్గెట్ చేసిందో అర్థం కావడం లేదని పేర్కొంది. ఇదే సమయంలో ఎవరైనా ఇంకొకరిని ఎందుకు అనుసరిస్తారంటూ ప్రశ్నించింది. గతంలో నటీ నటులు తమ కంటే సీనియర్లను చూసి అనుసరించే వారని, నేర్చుకునే వారని తెలిపింది. కానీ ఇప్పుడు అలా చేసేందుకు వీలు కుదరదని స్పష్టం చేసింది తాప్సీ పన్ను.
ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి సీన్ మారి పోయిందన్నారు. కేవలం కథలకే ప్రయారిటీ ఇస్తున్నారని, మంచి సినిమాలను, సొసైటీని ప్రభావితం చేసే సంఘటనల ఆధారంగా తయారయ్యే మూవీస్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పారు తాప్సీ పన్ను. ఈ సమయంలో కంగనాను చూసి తాను ఎలా అనుసరిస్తానంటూ తిరిగి ప్రశ్నించింది. ఒకవేళ అనుసరించినా తనకు కంగనాకు ఇచ్చే రెమ్యూనరేషన్ విషయంలో తనకు రావడం లేదంటూ వాపోయింది.
మొత్తంగా తాప్సీ పన్ను చేసిన తాజా కామెంట్స్ సినీ రంగంలో కలకలం రేపుతున్నాయి. అనుకరణ , స్పూర్తి పొందడం అనేది ప్రతి రంగంలోనూ ఉంటుందని పేర్కొంది.
Also Read : Hero Ajith Injury :రేసింగ్ లో అజిత్ కు తప్పిన ప్రమాదం