Taapsee Pannu : తన పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ‘తాప్సి’

Hello Telugu - Taapsee Pannu

Taapsee Pannu : దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది తాప్సీ పన్నూ . తెలుగు, తమిలం, హిందీ భాషలలో వరుస సినిమాలో చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో పడింది. రెండు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే తన పెళ్లికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయలేదు తాప్సీ. కానీ ఉదయ్ పూర్ లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఓ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొట్టింది.

Taapsee Pannu Comment

తాజాగా తన పెళ్లికి సంబంధించిన షాకింగ్ నిజాలను బయటపెట్టింది తాప్సీ. గతేడాది డిసెంబర్ లోనే ఇరు కుటుంబాల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని, ఈ డిసెంబర్ లో తమ వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరిగిందని తెలిపింది. ఈ విషయాన్ని తాను బయటపెట్టకుంటే ఎవరికీ తెలియదని.. తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచడమే ఉత్తమమని.. పబ్లిక్ చేస్తే వృత్తిపరమైన విషయాలకు ఇబ్బంది అవుతుందని చెప్పుకొచ్చింది.

Also Read : Chiranjeevi-Allu Arjun : మెగాస్టార్ ఇంటికి అల్లు అర్జున్ ఫామిలీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com