బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి తాప్సీ పన్ను హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. ఇందుకు కారణం ఎవరూ ఊహించని రీతిలో భారీ ధరకు కారును కొనుగోలు చేసింది తాప్సీ పన్ను.
ఈ కారు అత్యాధునిక సదుపాయలు కలిగిన కారును కొనుగోలు చేసేందుకు ముచ్చట పడ్డారు. దాని ధర లక్షల్లో ఉందని అనుకుంటే పొరపాటు పడినట్లే . కళ్లు చెదిరేలా ధర ఉంది. మెర్సిడెస్ కంపెనీకి చెందిన మేబాష్ జీఎల్ఎస్ ఎస్యువీని కొనుగోలు చేసింది. ఈ వాహనం ధర రూ.2.92 కోట్లు.
కాస్ట్ లీ కారు కొన్న విషయాన్ని నటి తాప్సీ పన్ను ధ్రువీకరించింది. జీవితంలో ఒక స్థాయి రావడానికి చాలా కష్టపడ్డాను. చిన్నప్పుడు ఖరీదైన కారులో వెళ్లే వాళ్లను చూశాను. తాను కూడా పెద్దయ్యాక అలాంటి ఖరీదైన వాహనంలో జర్నీ చేయాలన్న కోరిక ఉండేది. ఆ కోరిక ఇవాళ తీరిందని తెలిపింది నటి తాప్సీ పన్ను.
ప్రస్తుతం తాప్సీ పన్ను బిజీగా ఉన్నారు. తాజాగా దిగ్గజ దర్శకుడు రాజు హీర్వానీ దర్శకత్వంలో డుంగీ చిత్రంలో నటిస్తున్నారు. కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ నెలలో రానుందని ప్రకటించాడు బాద్ షా. మొత్తంగా తాప్సీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు.