Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆయన పెద్దమ్మ (కృష్ణంరాజు భార్య) శ్యామలా దేవి ప్రశంసలు కురిపించారు. 1000 రెబల్ స్టార్లని కలిపితే ఒక ప్రభాస్ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గురువారం విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ లో ఆమె వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Kalki 2898 AD…
ఈ సందర్భంగా శ్యామాలదేవి మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాని ఆదరించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్, మా కుటుంబ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రంలోని ఫైట్లు మరో స్థాయిలో ఉన్నాయి. వాటి గురించి చెప్పేందుకు మాటల్లేవ్’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఐమ్యాక్స్ వద్ద ప్రదర్శనకు ఉంచిన ‘బుజ్జి’ (సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించారు) వాహనం డ్రైవింగ్ సీటులో కూర్చొని, ప్రేక్షకులకు అభివాదం చేశారు. సంబంధిత విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
మరోవైపు, రేణూ దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్, స్నేహితులతో కలిసి అదే ఐమ్యాక్స్‌లో మార్నింగ్ షో చూశారు. సినిమా పూర్తయిన తర్వాత తమ గ్యాంగ్ అంతా కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినిమా బాగుందని, ఫ్యామిలీతో కలిసి వెళ్లమని అభిమానులకు చెప్పారు. చివరి 30 నిమిషాల సినిమా తనను కొత్త ప్రపంచలోకి తీసుకెళ్లిందని దర్శకుడు రాజమౌళి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘‘కల్కి(Kalki 2898 AD)’ ప్రపంచాన్ని సృష్టించిన తీరు అమోఘం. తన టైమింగ్ తో డార్లింగ్ ప్రభాస్ అలరించాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ఈ సినిమాకి పెద్ద సపోర్ట్. దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ టీమ్‌కు అభినందనలు’’ అని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో రాజమౌళి అతిథి పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే.
Also Read : Trisha-Nayanthara : అవును మేమిద్దరం గొడవ పడ్డాం అంటున్న త్రిష