Swatantra Veer Savarkar: ఓటీటీలోకి ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి 'స్వాతంత్ర్య వీర్ సావర్కర్' ! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Hello Telugu - Swatantra Veer Savarkar

Swatantra Veer Savarkar: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ దీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సావర్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాను మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. అయితే బయోపిక్స్ ట్రెండ్ పాతబడటం వల్లో ఏమో గానీ ఈ సినిమాకు అనుకున్నంతగా వసూళ్లు రాలేదు. టైటిల్ రోల్‌లో రణ్‌ దీప్ హుడా అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నప్పటికీ సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ కాలేదు. అయితే ఈ సినిమాను సావర్కర్ జయంతి సందర్భంగా ఓటీటీలోకి తీసుకువస్తున్నారు.

Swatantra Veer Savarkar Movie OTT…

రణ్ దీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్(Swatantra Veer Savarkar)’ సినిమాని ఇతడే దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు సావర్కర్ జీవితంలో ఏం జరిగింది? ఇంతకు ఆయన ఎవరు అనే విషయాల్ని ఇందులో చూపించారు. రూ.20 కోట్ల బడ్జెట్ పెడితే రూ.30 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. సావర్కర్ గురించి ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవడం వల్లే ఈ మూవీ సగటు ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇకపోతే మే 28న సావర్కర్… 141వ జయంతి సందర్భంగా మూవీని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారు. జీ5 వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Bangalore Rave Party: బెంగళూరులో రేవ్‌పార్టీలో పట్టుబడ్డ తెలుగు నటీనటులు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com