Swara Bhasker : నటి స్వర భాస్కర్ సంచలనంగా మారారు. తాజాగా ఎక్స్ వేదికగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె మహా కుంభ మేళా తో పాటు విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటించిన ఛావా చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక ఉత్సవం పేరుతో జనం చని పోతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. మరో వైపు ఆనాడు చోటు చేసుకున్న ఘటనలను ఆధారంగా చేసుకుని విడుదలైన ఛావాను ఆదరించడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
Swara Bhasker Shocking Comments on..
తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరంతా మహా కుంభ మేళాకు వెళ్లాల్సిన వాళ్లు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. కానీ ఇంత ఘోరం జరిగినా, పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయినా ఏ ఒక్కరు స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు మనుషుల పట్ల ప్రేమ, అనురాగం , స్పందన కరువవుతోందంటూ వాపోయారు.
కానీ ఛావాలో హిందువులను హింసించే సన్నివేశానికి ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నారంటూ బాంబు పేల్చారు. దీనిపై సోషల్ మీడియాలో స్వర భాస్కర్(Swara Bhasker) ను ఏకి పారేస్తున్నారు నెటిజన్లు. తను ముస్లింను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె ఎక్కడా కుంభమేళా గురించి కానీ ఛావా చిత్రం గురించి కానీ ప్రస్తావించక పోవడం గమనార్హం.
Also Read : Beauty Sai Pallavi-Thandel :ఓటీటీలోకి రానున్న తండేల్