Swapna Choudhary: కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇటీవల ముగిసింది. ఉల్టాపుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో తెలియదు కానీ వివాదాలు మాత్రం భారీగానే చుట్టుముడుతున్నాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్… షో నుండి బయటకు వస్తున్న సమయంలో జరిగిన గలాటాలో…. కొంతమంది అభిమానులు మిగిలిన కంటెస్టెంట్లపై దాడు చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసారు.
దీనితో కొంతమంది అభిమానులు చేసిన ఓవరాక్షన్ కు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఇప్పుడు పోలీసు స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ వివాదం సమసిపోయిందని అనుకునే లోపే… బిగ్ బాస్(Big Boss) పేరుతో తనను ఓ వ్యక్తి మోసం చేశాడంటూ టాలీవుడ్ నటి, యాంకర్ స్వప్న చౌదరి(Swapna Choudhary) సంచలన ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ షో కు పంపిస్తానని అతడు… తనను ఏ విధంగా మోసం చేసారు అనే దానిపై ఆమె ఒక వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Swapna Choudhary – సంచలనంగా మారిన యాంకర్ స్వప్న చౌదరి వీడియో
యాంకర్ స్వప్న చౌదరి(Swapna Choudhary) విడుదల చేసిన వీడియో విషయానికి వస్తే… ‘నాకు బిగ్ బాస్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం.. ఎంతలా అంటే నేను నిద్రపోతున్న సమయంలో కూడా బిగ్ బాస్‌లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్ బాస్ సీజన్ -1 నుంచి అన్నీ సీజన్లు ఎంతో ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్-7 సమయంలో నన్ను కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పి తమ్మలి రాజు అనే వ్యక్తి నా దగ్గర రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో ప్రతి శనివారం వచ్చే ఎపిసోడ్ సమయంలో నాకు కాస్ట్యూమ్స్ పంపిస్తానన్నాడు. అతని మాటలు నమ్మి నేను గతేడాది జూన్‌లో డబ్బు ఇచ్చాను. ఆ డబ్బే కాకుండా ఫోటో షూట్ కోసం రూ. 25వేలు తీసుకున్నాడు.
చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి చేతులెత్తేశాడు. ఆ సమయంలో రాజు నాకొక అగ్రిమెంట్ రాసిచ్చాడు. బిగ్ బాస్‌కు పంపించలేకపోతే డిసెంబర్ నెలలో డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కాల్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ కాలేదు… జనవరిలో తప్పకుండా ఇస్తానన్నాడు… తీరా ఇప్పుడు కాల్ చేస్తే నీకు నచ్చింది చేసుకో… కావాలంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకో అని వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించుకున్నాను. బిగ్ బాస్(Big Boss)లోకి వెళ్దామనే నా ఆశను తుంచేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మి టీమ్‌గా పెట్టుకోకండి. వచ్చే సీజన్‌లో అయిన నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను,” అంటూ ఈ వీడియోలో స్వప్న వివరించింది.
‘నమస్తే సేట్ జీ’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి అందరి నోట మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఖమ్మం జిల్లాకి చెందిన అమ్మినేని స్వప్న చౌదరి. యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా, అటూ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి బిగ్ బాస్‌కు వెళ్లాలని చాలారోజుల నుంచి కోరిక ఉంది. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పుకొచ్చింది. దీనినే కొందరు అదునుగా చూసుకొని తమ్మలి రాజు అనే వ్యక్తి ఆమె నుంచి రూ. 2.50 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది.
Also Read : Hero Balakrishna: పుష్ఫ స్పాట్ లో బాలయ్య యాక్షన్ !