Mystirious : జయ వల్లందాస్ నిర్మాతగా మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో మిస్టీరియస్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ మూవీకి సంబంధించి అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు.
Mystirious Movie Updates
ఈ చిత్రంలో రోహిత్ సహాని, రియా కపూర్ , మేఘనా రాజ్ పుత్, అబిద్ భూషణ్ కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో ప్రతి పాత్ర మిస్టీరియస్ గా ఉంటుందని చెప్పారు మూవీ మేకర్స్. అందమైన లొకేషన్స్ ను ఇందులో చూస్తారని, ప్రేక్షకులు ఆద్యంతమూ ఆనందాన్ని అనుభవించడం పక్కా అని ఈ సందర్బంగా తెలిపారు దర్శకుడు మహి కోమటి రెడ్డి.
త్వరలోనే మిస్టీరియస్ మూవీకి సంబంధించి పాటలను కూడా విడుదల చేస్తామన్నారు. ఇంకా డేట్ అనుకోలేదన్నాడు. అయితే మూవీ రిలీజ్ చేసే సంగతిని ప్రకటిస్తామన్నారు. కాగా ఈ సినిమాకు కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అంతా దర్శకుడిదే కాగా సంగీతం ఎంఎల్ రాజా అందించారు. అయితే ఇటీవల ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పులు చోటు చేసుకున్నాయని, వారంతా సస్పెన్స్ ను , అంతకు మించిన థ్రిల్లింగ్ ను కోరుకుంటున్నట్లు చెప్పారు నిర్మాత.
Also Read : Hero NTR-Prasanth : తారక్ ప్రశాంత్ నీల్ మూవీ కన్ ఫర్మ్