Kanguva OTT : సూర్య ఫాంటసీ యాక్షన్ సినిమా ‘కంగువా’ ఇక ఓటీటీలో

ఫ్రాన్సిస్‌(సూర్య) గోవాలో ఓ బౌంటీ హంటర్‌...

Hello Telugu - Kanguva OTT

Kanguva : సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంగువా(Kanguva)’ ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. డిసెంబరు 8న ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రైమ్‌ వీడియో ఎక్స్‌ వేదికగా పోస్టర్‌ను పంచుకుంది. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. విశాపటానీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాబీదేవోల్‌ విలన్‌గా కనిపించారు.

Kanguva Movie OTT Updates

ఫ్రాన్సిస్‌(సూర్య) గోవాలో ఓ బౌంటీ హంటర్‌. పోలీసులు కూడా చేయలేని పనుల్ని చేసి, అందుకుగానూ వాళ్ల నుంచి డబ్బు తీసుకుంటూ కాలం గడుపుతుంటాడు. ఏంజెలా (దిశా పటానీ)దీ ఇదే పని. ఒకప్పుడు వీరిద్దరూ ప్రేమికులే. ఆ తర్వాత విడిపోయి ఎవరి దారులు వాళ్లు చూసుకుంటారు. ఫ్రాన్సిస్‌, తన స్నేహితుడు (యోగిబాబు)తో కలిసి ఓ బౌంటీ హంటింగ్‌ పనిపై ఉన్నప్పుడే జీటా అనే బాలుడిని కలుసుకుంటారు. ఫ్రాన్సిస్‌, జీటా కలుసుకోగానే ఇద్దరికీ ఏదో తెలియని సంబంధం ఉన్న భావన కలుగుతుంది. ఆ తర్వాత ఆ బాలుడి ప్రాణానికి ప్రమాదం ఉందని అర్థమవుతుంది. మరి జీటాని కాపాడటానికి ఫ్రాన్సిస్‌ ఎలాంటి సాహసాలు చేశాడు. ఈ జీటాని వెంటాడుతున్నది ఎవరు? ఫ్రాన్సిస్‌, జీటా, 1070 సంవత్సరాల నాటి ప్రణవకోన యువరాజు కంగువా (సూర్య)కి మధ్య సంబంధం ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమాపై ఓ లుక్కేయాల్సిందే!

Also Read : Pushpa 2 Case : హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీ అరెస్ట్ ఖాయమా..

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com