Suryapet Junction : రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో ఎన్. శ్రీనివాస్ రావు, అనిల్ కుమార్ కాట్రగడ్డ నిర్మాణ సారథ్యంలో తీసిన సూర్య పేట్ జంక్షన్ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఇందులో ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించారు. ప్రధానంగా చిత్ర కథను హీరో రాయడం విశేషం. సూర్యపేట(Suryapet) పరిసరాల్లో జరిగిన యధార్థ కథ. దీనిని తెరకెక్కిస్తే బాగుంటుందని సూర్యపేట్ జంక్షన్ అని పేరు పెట్టడం జరిగిందన్నారు.
Suryapet Junction Movie Updates
ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇచ్చే పథకాలు అందుకోవడం వల్ల కలిగే అనర్థాలను పాయింట్ గా తీసుకుని సినిమా చేశామన్నాడు నటుడు ఈశ్వర్. ఒక్కో సమస్య ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుందన్నారు. కానీ రాను రాను ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే చివరకు ఏమీ మిగలదనే సత్యాన్ని తాము చెప్పాలనే ప్రయత్నం చేశామన్నారు ఈశ్వర్.
పూర్తిగా సందేశాత్మక సినిమా అనుకుంటే పొరపాటని, ఇందులో ప్రేక్షకులకు కావాల్సినవన్నీ ఉన్నాయని తెలిపారు. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్ కూడా ఫుల్ గా ఉంటుందన్నాడు. త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఇది కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం తమకు ఉందన్నాడు హీరో. ఇక నైనా సర్వర్ ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయన్నారు.
Also Read : Samantha Shocking Comments : ఆడబిడ్డలకు స్వేచ్ఛ లేకుండా పోతోంది