Surya Sethupathi: హీరోగా అయినా, విలన్ గా అయినా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను మొప్పించే అతి తక్కువ మంది నటుల్లో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఒకరు. పిజ్జా సినిమాతో హీరోగా అమాయకంగా కనిపించాలన్నా… సంతానం పాత్రలో విక్రమ్ సినిమాలో విలన్ గా గంభీరంగా కనిపించాలన్నా విజయ్ సేతుపతికే సాధ్యం.
ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు, జవాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయిన విజయ్ సేతుపతి… ఎటువంటి సపోర్ట్ లేకుండా స్వంత కష్టం మీద కోలీవుడ్ లో స్థానం దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తన వారసుడు సూర్య సేతుపతికి మాత్రం తండ్రిగా తన పూర్తి సహకారం అందిస్తూ హీరోగా పరిచయం చేయబోతున్నాడు.
Surya Sethupathi – సూర్య సేతుపతి హీరోగా ‘ఫీనిక్స్’
స్వంత కష్టంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విజయ్ సేతుపతి(Vijay Sethupathi)… తన వారసుడు సూర్య సేతుపతి హీరోగా లాంచ్ చేయబోతున్నారు. సూర్య సేతుపతి ప్రధాన పాత్రలో సీనియర్ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు. బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజలక్ష్మి అరశకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఏవిఎం స్టూడియోస్ లో ఇటీవలే నిర్వహించారు.
స్టంట్ మాస్టర్ అనల్ అరసుకి దర్శకుడిగా ‘ఫీనిక్స్’ డెబ్యూ చిత్రం కాగా `ఖైదీ` కంపోజర్ సామ్ సిఎస్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. దీనితో సూర్య సేతుపతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. తండ్రిని మించిన తనయుడివి కావాలంటూ విజయ్-సూర్య సేతుపతుల ద్వయం ఉన్న ఫోటోలను ట్యాగ్ చేస్తున్నారు.
బాల నటుడు నుండి కోలీవుడ్ హీరోగా
సూర్య సేతుపతి విషయానికి వస్తే తన తండ్రి విజయ్ సేతుపతితో కలిసి పలు సినిమాల్లో బాల నటుడిగా కనిపించారు. ముఖ్యంగా నానుమ్ రౌడీ తాన్, సింధుబాహ్, విడుతలై 2 (రిలీజ్‌కి రానుంది) వంటి చిత్రాలలో సూర్య సేతుపతి బాల నటుడిగా చిన్న చిన్న పాత్రలు పోషించాడు.
ఇక దర్శకుడు అనల్ అరసు విషయానికి వస్తే… సీనియర్ స్టంట్ మాస్టర్ గా ఉన్న అనల్ అరసు… ఇండియన్ 2, జవాన్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, .బిగిల్ వంటి చిత్రాలకు యాక్షన్ సీక్వెన్స్ ను అందించి హాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మొట్టమొదటిసారిగా అనల్ అరసు దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : Suriya: తన ఆరోగ్యం గురించి అభిమానులకు సూర్య ఎమోషనల్ పోస్ట్