Surya: ‘కంగువా’ షూటింగ్ లో గాయపడ్డ హీరో సూర్య

‘కంగువా’ షూటింగ్ లో గాయపడ్డ హీరో సూర్య

Hello Telugu - Surya

Surya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఆఖరి దశకు చేరుకుంది. క్లైమాక్స్ లోని కీలక యాక్షన్ సీక్వెన్స్‌ను థాయిలాండ్‌లోని అడవిలో ఇటీవలే పూర్తి చేసిన చిత్ర బృందం తదుపరి షూటింగ్ ను చెన్నైలో జరుపుకుంటోంది.

Surya – చెన్నైలో షూటింగ్ లో గాయపడ్డ సూర్య…

‘కంగువా’ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో సూర్యకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి జరిగిన షూట్‌లో రోప్‌ కెమెరా ప్రమాదవశాత్తు తెగి… సూర్య భుజంపై పడింది. దీనితో సూర్య(Surya)భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. దీనితో వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ షూటింగ్ ను వెంటనే నిలిపివేసి… సూర్యను నగరంలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సూర్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలతో పాటు చిత్ర యూనిట్ నుండి సమాచారం అందుతోంది. దీనిపై సూర్య అభిమానులు స్పందిస్తూ ‘గెట్ వెల్‌ సూన్‌’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read : Nithin: విదేశీ డ్యాన్సర్లతో నితిన్ ఊర మాస్‌ డ్యాన్స్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com