Suriya : తమిళస్టార్ సూర్య, త్రిషలది సక్సెస్‌ఫుల్ పెయిర్. వీరిద్దరి కాంబోలో ‘మౌనం పేసియాదే’, ‘ఆరు’సినిమాలు చక్కని విజయాన్ని సాధించాయి. ఇప్పుడీ హిట్టు జోడీ దాదాపు రెండు దశాబ్దాల విరామం తర్వాత కలిసి నటించనున్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సూర్య(Suriya) కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన 44వ చిత్రం చేస్తున్నారు. తన 45వ చిత్రం కోసం కూడా సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికి ఆర్.బాలాజీతో దర్శకత్వం వహిస్తారు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఇద్దరు నాయికలకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ క్యారెక్టర్ కోసం త్రిషను ఖరారు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై సంప్రదింపులు పూర్తయ్యాయని సూర్య సన్నిహిత వర్గాల నుంచి టాక్.
Suriya-Trisha Movie Updates
ఇందులో ఆమెతో పాటు మరో నాయికగా రుక్మిణీ వసంత్ కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. కశ్మీరా పరదేశీ కీలక పాత్రలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా సూర్య కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
Also Read : Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ వాయిదా పై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు