Suriya : బహు భాషా నటి పూజా హెగ్డే బిజీగా మారింది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) తో కలిసి నటిస్తోంది. తనే దర్శకత్వం వహిస్తున్న చిత్రం రెట్రో. ఇప్పటికే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ , బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించి మెప్పించింది. ఇందులో కొన్ని సక్సెస్ కాగా మరికొన్ని ఆశించిన మేర మూవీస్ ఆడలేదు. టాప్ హీరోస్ తో కలిసి నటించింది. మొహెంజోదారోలో హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో జతకట్టింది. తాజాగా షాహిద్ కపూర్ తో లిప్ లాక్ కిస్ తో కిర్రాక్ ఎక్కించేలా చేసింది పూజా హెగ్డే.
Suriya – Pooja Hedge Combination
ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ రెట్రో తమిళ చిత్రంలో నటించేందుకు సిద్దమవుతోంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ . ప్రధాన పాత్ర పోసిస్తోందంటూ ప్రకటించారు మూవీ మేకర్స్. నటన పట్ల తనకు ఉన్న అంకిత భావం, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం వల్లనే తనను రెట్రో చిత్రానికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు చిత్ర నిర్మాతలు.
రెట్రో మూవీకి సంబంధించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పలువురు హీరోయిన్లను కదిలించాడు. కానీ అందరిని కాదని పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నాడు. తను గతంలో తొలి తమిళ చిత్రంలో నటించింది. ఇదే సమయంలో సూపర్ స్టార్ దళపతి విజయ్ తో కలిసి నటించింది. సెట్ లో కీలకంగా మారింది. తమిళ భాషను నేర్చుకుని డైలాగ్ లను తనే చెబుతుండడం పట్ల దర్శకుడు ఆనందం వ్యక్తం చేశాడు.
Also Read : Nayanthara Shocking :కాపీ రైట్ వివాదం కోటి పరిహారం