Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Suriya Movie Updates
అయితే ఇప్పుడీ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో ఒక ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రబృందం భారీ స్థాయిలో ప్లాన్ చేసిందట. అది ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పొన్నియిన్ సెల్వన్’లను తలపిస్తుందని టాక్. ఈ సినిమాలో హీరో సూర్య(Suriya)… ప్రతినాయకుడి బాబీడియోల్ ల మధ్య క్లైమాక్స్ ఫైట్ ఊహించని స్థాయిలో ఉండనుందట. ఏకంగా 10వేల మందితో దాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. సినిమాకు ఇదే హైలైట్ కానుందని… దీనికోసం టీమ్‌లోని వారంతా ఎంతో శ్రమించారని సినీ వర్గాలు వెల్లడించాయి.
కంగ అనే పరాక్రముడి కథను ఈ సినిమా ద్వారా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమా ఫలితం గురించి నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని… పార్ట్ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్ తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్నట్లు సమాచారం.
Also Read : Anand Devarakonda : సిక్స్ ప్యాక్ లుక్ లో అదరగొడుతున్న ఆనంద్ దేవరకొండ