సినిమా రంగం ఎప్పుడూ సక్సెస్ అయిన వాళ్లనే నెత్తికి ఎక్కించుకుంటుంది. ఒక సినిమా గనుక ఫ్లాప్ అయితే ఇక అతడి వైపు చూడరు. కానీ సురేందర్ రెడ్డి అలా కాదు. జయాపజయాలకు దూరంగా ఉంటాడు. సక్సెస్ ను ఎంజాయ్ చేసినట్టుగానే పరాజయాన్ని కూడా లైట్ గా తీసుకుంటాడు. అందుకే తనంటే చాలా మంది హీరో, హీరోయిన్లకు, సినీ సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు ఇష్టం.
ఇక తెలుగులో టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వాళ్లలో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా పేరు పొందాడు సురేందర్ రెడ్డి. కానీ తను అఖిల్ తో తీసిన ఏజెంట్ బోల్తా కొట్టింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 80 కోట్లకు పైగానే అయ్యిందని టాక్. కనీసం 20 కోట్లు కూడా రాలేదని ఆ మధ్యన సమాచారం.
ఏజెంట్ ఫెయిల్ అయినా మనోడికి మరిన్ని ఛాన్స్ లు వస్తున్నాయట. తను ఇప్పటికే మూడు కథలను సిద్దం చేశాడని ఇది ఇప్పటికే పవన్ కళ్యాణ్ , విక్టరీ వెంకటేష్ కు కథ చెప్పాడని వాళ్లు కూడా ఓకే చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు.
మరి సురేందర్ రెడ్డి నెక్ట్స్ సినిమా ఎవరితో చేయబోతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారి పోయింది. టేకింగ్ లోనే కాదు మేకింగ్ లోనూ తనదైన స్టైల్ ఉంటుంది దర్శకుడికి. విచిత్రం ఏమిటంటే కొరటాల శివకు కూడా సేమ్ సీన్ . తను చిరు, చరణ్ తో ఆచార్య తీశాడు. అది దొబ్బింది. కానీ తారక్ పిలిచి సినిమా చేస్తానని చెప్పాడు. అదే దేవర షూటింగ్ కొనసాగుతోంది.