Rajinikanth: పాన్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్… సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు. జైలర్ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న తలైవా… ప్రస్తుతం ‘వేట్టయాన్’తో దసరా బరిలో సందడి చేయనున్నారు. ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ తో ‘కూలీ’తో పలకరించనున్నారు. ఈ సినిమా కూడా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇది పూర్తయిన తరువాత తన బ్లాక్ బస్టర్ సినిమా జైలర్ కు సీక్వెల్ గా ‘జైలర్ 2’ను పట్టాలెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే తలైవా ఇప్పుడు మరో కథ విషయమై ఓ యువ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
Rajinikanth Movie Updates
‘కర్ణన్’, ‘మామన్నన్’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు మారి సెల్వరాజ్. ఆయన ప్రస్తుతం రజనీతో ఓ సినిమా చేసేందుకు కథా చర్చలు జరుపుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. ‘‘రజనీకు నేనంటే ఇష్టం. నా గత చిత్రాలు ‘కర్ణన్’, ‘మామన్నన్’ చూసి ఫోన్ చేసి అభినందించారు. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు సెల్వరాజ్. ప్రస్తుతం మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ‘వాజై’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘బైసన్’ 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
Also Read : Pawan Kalyan: సోదరితో ఉన్న చిన్నప్పటి రేర్ పిక్ ని షేర్ చేసిన పవర్ స్టార్ !