Mahesh Babu : నెట్టింట తెగ వైరల్ అవుతున్న సూపర్ స్టార్ మహేష్ ట్వీట్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ల్లోనూ అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు...

Hello Telugu - Mahesh Babu

Mahesh Babu : సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్‌ చేశారు. శుక్రవారం తన పుట్టినరోజుని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ నిన్న నా పుట్టినరోజు సందర్భంగా మీరు పంపించిన సందేశాలను, చూపించిన ప్రేమాభిమానాలను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయా. మీరందరూ ఈ స్పెషల్‌ డేని నాకు మరింత ప్రత్యేకంగా మారేలా చేశారు. ప్రతి ఏడాది మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. లవ్‌ యూ’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘ లవ్‌ యూ మహేష్‌ అన్నా’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

Mahesh Babu Tweet

ఇక మహేశ్‌బాబు(Mahesh Babu) పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయిన ‘మురారి’చిత్రాన్ని 4కె వెర్షనలో శుక్రవారం రీ రిలీజ్‌ చేశారు. ఇప్పుడు కూడా ఈ చిత్రానికి ప్రేక్షకులు, అభిమానులు విపరీతంగా వీక్షించారు. థియేటర్‌ల దగ్గర పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ల్లోనూ అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారీ కటౌట్లు ఏర్పాటుచేసి కేకులు కట్‌ చేసి తమ ప్రేమను చాటుకున్నారు. ఈ ఏడాది గుంటూరు కారం’ చిత్రంతో అలరించిన మహేష్‌ తదుపరి ప్రాజెక్ట్‌ కోసం సన్నద్థమవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 తెరకెక్కనుంది. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకూ రాని కథ, సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read : Committee Kurrollu : హృదయాలను కదిలించే స్నేహితుల స్టోరీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com