Superboys of Malegaon : కొన్ని కథలు కట్టి పడేస్తాయి. మరికొన్ని ప్రేక్షకుల మనసు దోచుకుంటాయి. ఇంకొన్ని నిద్రలో సైతం వెంటాడేలా చేస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్(Superboys of Malegaon) పై పెద్ద ఎత్తున ఆసక్తిని రేపుతోంది. ఇండియా, యుఎస్ , యుకె, యుఏఈ , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , తదితర దేశాలలో విడుదలకు సిద్దంగా ఉంది.
Superboys of Malegaon Interesting Updates
ఈ చిత్రానికి రీమా కాగ్టీ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. దీనిని ఆస్ట్రేలియా లోని సిడ్నీలో ది నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఆస్ట్రేలియా (ఎన్ఐఎఫ్ఎఫ్ఏ) ను ప్రదర్శించడం విశేషం. ఇదిలా ఉండగా గత ఏడాది 2024 సెప్టెంబర్ 14న 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఫ్ ) లో ప్రీమీయర్ అయ్యింది.
ఆ తర్వాత 68వ బీఎఫ్ఐ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్, 4వ రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్, 36వ పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీనిని ప్రదర్శించారు. ఇదిలా ఉండగా సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్ తమ పరిస్థితులు తమను తాము నిర్వచించు కోవడానికి నిరాకరించే స్నేహితుల బృందాన్ని అనుసరిస్తుంది. ఈ చిత్రం స్నేహం, అభిరుచి, చిత్రని ర్మాణంలో కనికరంలేని స్ఫూర్తికి నిదర్శనం.
టైగర్ బేబీ ఫిల్మ్స్‌కు చెందిన జోయా అక్తర్, రీమా కాగ్టిలతో పాటు, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ వంటి పవర్‌హౌస్ కథకుల మద్దతుతో, సూపర్‌బాయ్స్ ఆఫ్ మాలెగావ్ శాశ్వత ముద్ర వేయడానికి ప్రయత్నించే కథనాన్ని వాగ్దానం చేస్తుందనడంలో సందేహం లేదు.
Also Read : Pushpa 2- RGV Shocking :పుష్ప2 మూవీపై కామెంట్స్ ఆర్జీవీ ఫైర్