Super Star Rajinikanth: కోలీవుడ్ యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ సినిమా ‘జైలర్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మిర్నా మేనన్, యోగిబాబు కీలక పాత్రలలో మెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయితే… వర్మన్ గా వినాయకన్ విలనిజానికి కూడా అదే రేంజ్‌లో విజిల్స్ పడ్డాయి. గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతలకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనితో జైలర్ కు సీక్వెల్ (జైలర్2) కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు.
Super Star Rajinikanth Movies
తాజాగా జైలర్ సీక్వెల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పవర్‌ఫుల్ సీక్వెల్‌కు ‘హుకుం’ అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీని ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. రజనీకాంత్‌కు(Super Star Rajinikanth) నెల్సన్ స్క్రిప్ట్ కూడా వినిపించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. షూటింగ్ ఈ ఏడాది చివరికి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోందట. ఇదొక ఫ్రాంచైజీగా మారనుందనేది తమిళ సినీవర్గాల మాట. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనితో #Jailer2, #Hukum హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీనితో జైలర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో తలైవాను చూడొచ్చని ఆనందిస్తున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ తెలుగులో ‘వేటగాడు’లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. అమితాబ్ బచ్చన్, రానా, ఫహాద్ ఫాజిల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీని చిత్రీకరణ ఇప్పటికే 80శాతం పూర్తయింది. తర్వాత లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా లైనప్‌లో ఉంది. ఇది పూర్తయ్యాక ‘జైలర్ 2’ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : Rajamouli-David Warner : వైరల్ అవుతున్న రాజమౌళి, డేవిడ్ వార్నర్ నటించిన యాడ్