రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న తలైవా ‘ముత్తు’
Super Star Rajanikanth : టాలీవుడ్ లో మొదలైన రీ రిలీజ్ల ట్రెండ్ కోలీవుడ్ ను తాకింది. తన అభిమాన హీరోల సినిమాకు, సినిమాకు మధ్య కాస్తా గ్యాప్ వస్తే చాలు… అప్పట్లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను… రీ రిలీజ్ పేరుతో మళ్ళీ విడుదల చేస్తున్నారు. దీనికి తోడు పాత సినిమాకు 4K టెక్నాలజీను జోడిస్తూ తన అభిమాన హీరో పుట్టినరోజు, సినిమా యానివర్సీలకు ఆ సినిమాను మరోసారి రిలీజ్ చేసి పండుగలా వేడుకను నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రారంభమైన ఈ రీ రిలీజ్ ల సంస్కృతిని… మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరూ ఫాలో అయిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ రీ రిలీజ్ సంస్కృతి కోలీవుడ్ ను తాకింది. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ సినిమాను మళ్లీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Super Star Rajanikanth – డిసెంబరు 2న 4K వస్తున్న ‘ముత్తు’
జైలర్ సినిమాతో తన సినిమా రికార్డులను తిరగరాసిన తలైవా రజనీకాంత్(Super Star Rajanikanth)…. పుట్టిన రోజు సందర్భంగా ‘ముత్తు’ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకొని ‘ముత్తు’ చిత్రాన్ని4Kలో డిసెంబర్ 2న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తలైవా పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్న ఈ ‘ముత్తు’ సినిమాను అటు తమిళనాడుతో పాటు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక నాలుగు ప్రాంతాల్లోని వేలాది థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితో డిసెంబర్ 2న పండుగ చేసుకునేందుకు తలైవా అభిమానులు సిద్ధం అవుతున్నారు. మరీ ముఖ్యంగా సినిమాలోని ‘థిల్లాన థిల్లాన’ పాటకు స్టెప్స్ దుమ్మురేపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ‘జైలర్’ తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన రజనీకాంత్… రీ రిలీజ్‌లోనూ తన స్థామినా చూపిస్తాడని అంతా భావిస్తున్నారు.
అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ముత్తు’
తలైవా రజనీకాంత్ కెరియర్‌లో సూపర్ హిట్ చిత్రాలలో ‘ముత్తు’ మొదటి వరుసలో ఉంటుంది. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 1995 అక్టోబరు 23న విడుదలైన ‘ముత్తు’ సినిమాలో రజనీకాంత్ సరసన మీనా హీరోయిన్‌గా నటించగా… ఎ. ఆర్. రెహమాన్ సంగీత మందించారు. తమిళనాడులోని చాలా థియేటర్లలో 175 రోజులు ప్రదర్శించబడి రజనీ సినీ చరిత్రలో తిరుగులేని విజయాన్ని సాధించింది. సౌత్‌లో సంచలనం సృష్టించిన ‘ముత్తు’ సినిమా 1998లో జపనీస్ భాషలో విడుదలై సంచలన విజయం అందుకోవడమే కాకుండా… సుమారు 400 మిలియన్ యాన్లను రాబట్టింది. దాంతో రజనీకాంత్ జపాన్‌లో కూడా వీరాభిమానులను సంపాదించుకున్నారు.
Also Read : The Village: ఉత్కంఠ రేపుతోన్న ‘ది విలేజ్’ ట్రైలర్