సన్నీ లియోన్ అనే సరికల్లా అడల్ట్ మూవీస్ వెంటనే గుర్తుకు వస్తాయి. కానీ సీన్ మార్చేసింది ఈ అమ్మడు. వాటికి పుల్ స్టాప్ పెట్టేసింది. మెయిన్ స్ట్రీమ్ మూవీస్ కు మారి పోయింది. సన్నీ లియోన్ ను బాలీవుడ్ ఆదరించింది. అక్కడి నుంచి పలు భారతీయ భాషలకు సంబంధించిన సినిమాలలో నటించింది.
అంతే కాదు తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి దాకా అడల్ట్ మూవీస్ తో ఆకట్టుకున్న ఈ భామ ఇంటిల్లిపాది చూసే సినిమాలకు ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. తనకు తన దేశం కంటే భారత్ బాగుందంటూ ఇండియాలో సెటిల్ అయి పోయింది సన్నీ లియోన్.
తాజాగా బుల్లి తెరపై ఈ ముద్దుగుమ్మ దర్శనం ఇవ్వబోతోంది. దాని పేరు తెలుగు ఇస్కూల్. దీనిని రూపొందించింది జీ తెలుగు టీవీ ఛానెల్. ఇందులో యాంకర్ రవి, డ్యాన్సర్ పండుతో కలిసి షో చేస్తోంది. తన కెరీర్ లో ఇదే తొలిసారి కావడం విశేషం.
ప్రస్తుతం తెలుగు ఇస్కూల్ కు సంబంధించి విడుదల చేసిన ప్రోమోకు మంచి ఆదరణ లభిస్తోంది. విచిత్రం ఏమిటంటే ఈ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుంది బూతు భామ సన్నీ లియోన్. సో ఈ షోపై భారీ అంచనాలు పెట్టుకుంది యాజమాన్యం.