Sunny Leone: రా అండ్ రస్టిక్ లుక్ లో పోర్న్ స్టార్ సన్నీ లియోనీ !

రా అండ్ రస్టిక్ లుక్ లో పోర్న్ స్టార్ సన్నీ లియోనీ !

Hello Telugu - Sunny Leone

Sunny Leone: మత్తెంక్కించే అందం, మైమరించే డ్యాన్స్ తో వెండితెరపై తన గ్లామరస్‌ పాత్రలతో పాటు ప్రత్యేక గీతాలతో కుర్రకారుని ఊర్రూతలూగిస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోనీ. పోర్న్ స్టార్ గా బాలీవుడ్ లో ప్రవేశించిన ఆమె… ఐటెం సాంగ్స్ తో దక్షిణాది బాషల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా నటిస్తూ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సుస్థిరమైన స్థానం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగాప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్ లతో కలిసి ‘కొటేషన్‌ గ్యాంగ్‌’అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు వివేక్‌ కుమార్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Sunny Leone..

గాయత్రి సురేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించి… మొదటి పార్టును జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనితో ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ప్రమోషన్లను షురూ చేసిన చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో రా అండ్ రస్టిక్ లుక్ లో గ్లామరస్ సన్నీ లియోనీ(Sunny Leone) చాలా రఫ్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తే మరో దండుపాళ్యం సినిమాలా కనిపిస్తోంది. డబ్బు కోసం హత్యలు చేసే సుపారీ గ్యాంగ్ కు సన్నీ లియోనీ, ప్రియమణి నాయకత్వం వహిస్తున్నట్లు ఈ ట్రైలర్ ను చూస్తే అర్ధమౌతోంది. అయితే ఎప్పుడూ గ్లామరస్ పాత్రలు, ఐటెం సాంగ్స్ లో చూసే సన్నీ లియోనీ ఈ విధంగా రా అండ్ రస్టిక్ లుక్ లు కనిపించడం పట్ల అభిమానులు షాక్ అవుతున్నారు.

‘కొటేషన్‌ గ్యాంగ్‌’ట్రైలర్ విడుదల సందర్భంగా సన్నీ లియోనీ మాట్లాడుతూ… ‘‘చాలా మంది దర్శకనిర్మాతలు గొప్ప గొప్ప కథలతో నా దగ్గరికి వస్తుంటారు. ‘ఈ పాత్ర మీ ఇమేజ్‌ని మారుస్తుంది’ అంటూ చెప్పినవాళ్లూ ఎక్కువే. ఇది విన్న ప్రతిసారి నేను చాలా సంతోషిస్తుంటాను. ఎందుకంటే వారు తమ సినిమాని, కథను నమ్ముతున్నారు. కానీ.. ఎంతో ప్రత్యేకంగా నా కోసమే ఈ పాత్రను, కథను సృష్టించినందుకు ధన్యవాదాలు’’ అని చెప్పుకొచ్చింది.

Also Read : Indian 2: వివాదంలో శంకర్ ‘ఇండియన్‌ 2’ సినిమా !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com