Sunny Leone: ప్రభుదేవాతో ఐటెం సాంగ్ కు సన్నీలియోన్ సై !

ప్రభుదేవాతో ఐటెం సాంగ్ కు సన్నీలియోన్ సై !

Hello Telugu - Sunny Leone

Sunny Leone: ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా ముద్ర వేసుకున్న నృత్యదర్శకుడు ప్రభుదేవా… ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దర్శకుడిగా హిట్‌ చిత్రాలను చేసిన ఈయన ప్రస్తుతం నటనపైనే దృష్టి పెడుతున్నారు. ఇటీవల భగీర అనే సినిమాలో రకరకాల గెటప్‌ ల్లో విలన్‌ గా ప్రభుదేవా అదరగొట్టారు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేదు. తాజాగా రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు ప్రభుదేవా. వాటితో పాటు విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న గోట్‌ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Sunny Leone Song..

ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో జాలియో జింఖానా ఒకటి. శక్తి చిదంబరం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మలయాళ భామ మడోనా సెబాస్టియన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రభుదేవా హీరోగా నటిస్తున్న మరో చిత్రం పేటరాప్‌. ఎస్‌జే.శీను దర్శకత్వం వహిస్తున్న ఇందులో వేదిక హీరోయిన్‌గా నటిస్తున్నా రు. బ్లూ హిల్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో బాలీవుడ్‌ సంచలన నటి సన్నీ లియోన్‌(Sunny Leone) ఒక ఐటమ్‌ సాంగ్‌లో నటిస్తున్నారు. ఇంతకు ముందు కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈమె చిన్నగ్యాప్‌ తరువాత మళ్లీ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారన్నమాట. వివేక్‌ ప్రసన్న, భగవతి పెరుమాళ్‌, రమేశ్‌ తిలక్‌, మైమ్‌గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతం అందిస్తున్నారు. దీనితో ప్రభుదేవా స్టైలిష్ కొరియోగ్రఫీ… సన్నీలియోన్ మాస్ స్టెప్స్ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Drashti Dhami: తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com