Sunny Deol : టాలీవుడ్ లో దమ్మున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని. తను తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. పవర్ ఫుల్ పాత్రలో చాన్నాళ్ల తర్వాత సన్నీ డియోల్ (పాజీ) తో పాటు రణ్ దీప్ హూడాను పెట్టి జాట్(Jaat) తీశాడు. ప్రేక్షకుల ముందుకు ఇవాళ వచ్చింది. అద్భుతమైన స్పందన లభించింది ఈ మూవీకి. ప్రత్యేకించి ఆకట్టుకునే సన్నివేశాలు, పోరాట దృశ్యాలు, అంతకు మించి పాజీ, హూడాల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగిన డైలాగ్ ల వార్ సూపర్ అంటూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. క్రిటిక్స్ సైతం పాజిటివ్ టాక్ వస్తుందంటూ పేర్కొన్నారు.
Sunny Deol Jaat Movie Updates
మొత్తంగా చాలా గ్యాప్ తర్వాత సన్నీ డియోల్(Sunny Deol) ను గోపిచంద్ అద్భుతంగా చూపించాడంటూ కితాబు ఇస్తున్నారు. మొత్తంగా గోపిచంద్ మామూలోడు కాదు. మాస్ మహారాజా రవితేజతో తాను తీసిన బలుపు సెన్సేషన్. తన చేతికి ఎవరు చిక్కినా శక్తివంతమైన హీరోగా తీర్చి దిద్దడంలో తనకు తనే సాటి. ఇక ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం జీవిత కథగా తెరకెక్కించిన చిత్రం డి తో ఒక్కసారిగా నివ్వెర పోయేలా చేశాడు రణ దీప్ హూడా. జాట్ ను పూర్తిగా యాక్షన్, థ్రిల్లర్ గా రూపించాడు దర్శకుడు.
జాట్ లో సన్నీ డియోల్, రణ్‌దీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, రెగెనా కాసాండ్రా, జగపతి బాబు, సయామి ఖేర్ కీలక పాత్రలు పోషించారు. సన్నీ డియోల్ స్వాగ్ , స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రణ్‌దీప్ హుడా పెర్ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ,ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ గా నిలిచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు గోపిచంద్ మలినేని. ఇందులో దబిడి సాంగ్ తో ఫేమ్ అయిన ఊర్వశి రౌతేలా ఇందులో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇది కూడా హైలెట్ గా మారింది. యే ధాయి కిలో కే హాత్ కి తాకత్ పురా నార్త్ దేఖ్ చుకా హై, అబ్ సౌత్ దేఖేగా అంటూ సన్నీ డియోల్ పేల్చిన డైలాగ్ కరెక్టుగా సరిపోతుంది.
Also Read : Hero Sampoornesh Babu :ఆసక్తి రేపుతున్న రైజింగ్ స్టార్ సోదరా