Sunil in Max: కిచ్చా సుదీప్ సినిమాలో విలన్ గా సునీల్

కిచ్చా సుదీప్ సినిమాలో విలన్ గా కన్నడలో ఎంట్రీ ఇవ్వబోతున్న సునీల్

Hello Telugu-Sunil in Max

Sunil in Max : కమెడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి… హీరోగా… విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్… ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వనున్నారు. నువ్వేకావాలి, చిరునవ్వుతో, నువ్వే నువ్వే, ఆనందం, ఠాగూర్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మంచి కమెడియన్ గా సునీల్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత అందాల రాముడు, పూలరంగడు, మర్యాదరామన్న, తడాఖా ల్లో హీరోగా కూడా విజయం సాధించారు.

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్… ఈ మధ్యకాలంలో కలర్ ఫోటో అనే సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు. అయితే మంగళం శీనుగా పుష్ప సినిమాలో ఎప్పుడైతే విలన్ గా నటించారో సునీల్(Sunil) కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత ఇతర భాషలలో కూడా నటిస్తూ మరింత క్రేజ్ అందుకున్న సునీల్ ఇప్పుడు ఏకంగా శాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

Sunil in Max – శాండిల్ వుడ్ లో సునీల్ ఎంట్రీ

శాండిల్ వుడ్ అగ్రహీరో కిచ్చా సుదీప్ విజయ్ కార్తికేయ దర్శకత్వంతో మ్యాక్స్ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, సంయుక్త హోర్నడ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు ఈ సినిమాను కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. కదాదాపు 75% సినిమా షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా మిగిలిన భాగాన్ని త్వరలో మహాబలిపురంలో షూటింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పుష్ప తరహాలోనే నెగిటివ్ రోల్ కు సునీల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల జైలర్ సినిమా ద్వారా పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న సునీల్ ఇప్పుడు ఏకంగా శాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

Also Read : Say No To Piracy:పైరసీపై కేంద్రం కఠిన చర్యలు

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com