Sunainaa : తనకు ఇతరులను ప్రేమించే సమయం లేదని, ఇప్పటి వరకు సినిమానే ప్రేమిస్తున్నానని హీరోయిన్ సునయన స్పష్టం చేసింది. ‘ రెజీనా’ సినిమా తర్వాత ‘రాకెట్ డ్రైవర్’సినిమాలో నటించిన సునైన ఆ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొని తనకు ఎదురైన ఓ ప్రశ్నకు సునైనా ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ నేను ఎల్లవేళలా సినిమాను మాత్రమే ప్రేమిస్తున్నానని, ఎవరిపైనా ప్రేమ లేదు. నాకు ఖాళీ దొరికిన సమయాల్లో వెబ్ సిస్‌లు చూడటం ఎంటర్‌టైన్మెంట్‌గా పెట్టుకున్నానని దీంతో అనేక విషయాలను నేర్చుకుంటున్నా’ అని అన్నారు.
Sunainaa Comment
కాగా, ఆమధ్య సునయన(Sunainaa) ఓ వేలుకు డైమండ్ రింగు పట్టుకుని ‘లాక్’ అనే క్యాప్షన్‌తో ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో సునైన ఓ దుబాయ్ యూట ట్యూబర్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి సునైన ఫుల్‌స్టాప్ పెట్టారు. 2005లో కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అచ్చ తెలుగు అందం ఆ తర్వాత ఇక్కడ రెండు,మూడు తెలుగు చిత్రాలు చేసిన సరైన గుర్తింపు దక్కక తమిళంలో పేరు తెచ్చుకుంది. ఆపై అడపదడపా తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. చివరగా తెలుగులో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన రాజ రాజ చోర అనే తెలుగు స్ట్రేయిట్ చిత్రం, నాని మీట్ క్యూట్, చదరంగం వెబ్ సిరీస్‌లలోనూ నటించింది. రెండు నెలల క్రితం రెజీనా అనే తమిళ చిత్రం, ఇన్ స్పెక్టర్ రిషి సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read : Hero Prabhas : అన్నింటా ప్రభాస్ ఆస్తుల విలువ అన్ని కోట్లా..