Mahendragiri Varahi : కాస్త విరామం తర్వాత సుమంత్(Sumanth) నటిస్తోన్న కొత్త చిత్రం మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబరు 2గా తెరకెక్కుతున్న ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. అయితే ఈ మూవీ గ్లిమ్స్ ఆసక్తికరంగా ఉందంటూ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో గ్లిమ్స్ కు మరింతగా స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
Mahendragiri Varahi Movie Updates
సుమంత్ చివరగా 2021లో మళ్లీ మొదలైంది సినిమాలో కథానాయకుడిగా నటించగా 2022లో ధనుష్ సార్, తుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లోనటించారు. ఇప్పుడు మైడేండ్ల విరామం తర్వాత హీరోగా ‘మహేంద్రగిరి వారాహి(Mahendragiri Vaarahi)’ అనే ఓ ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ‘ రంగమార్తాండ’ వంటి సినిమా తర్వాత రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంతోష్ జాగర్లమూడి దర్శకుడిగా, మీనాక్షి గోస్వామి కథానాయికగా పరిచయం అవుతోంది. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశం ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత కాలిపు మధు తెలిపారు. వచ్చే ఏడాది.. 2025 సంక్రాంతికి ఈమహేంద్రగిరి వారాహి చిత్రాన్ని విడుదల చెయ్యడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Also Read : Kanguva Movie : కంగువ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మాత