Anaganaga : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వెరీ వెరీ స్పెషల్ సుమంత్. తను గతంలో మహానంది, గోదావరి లాంటి క్లాసిక్ సినిమాలలో నటించాడు. కేవలం పాత్రలకు స్వాభిమానం, ఆత్మ గౌరవం ఉండేలా చూసుకుంటాడు. లేకపోతే తను నటించేందుకు ఇష్ట పడడు. ఒక రకంగా ఇతర హీరోలకంటే తను భిన్నం. ప్రత్యేకం కూడా.
Anaganaga Movie Teaser Giong Viral
తాజాగా తను కీ రోల్ పోషించిన అనగనగా(Anaganaga) చిత్రం టీజర్ విడుదలైంది. హృదయాలను హత్తుకునేలా ఉంది. సన్నివేశాలను మరింత అందంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ మూవీలో సుమంత్ తో పాటు కాజల్ అగర్వాల్ నటించింది. దీనికి సన్నీ విజయ్ దర్శకత్వం వహించాడు. రుద్ర ముదిరెడ్డి, రాకేశ్ గడ్డం నిర్మించారు అనగనగా చిత్రాన్ని.
చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ మరింత ఆలోచింప చేసేలా ఉన్నాయి. ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉంది టీజర్. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్బంగా అలరించేందుకు రాబోతోంది.
అనగనగాలో సుమంత్ పిల్లలకు జ్ఞానాన్ని అందించే టీచర్ పాత్ర పోషించాడు. సంగీతం, సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. మొత్తంగా ఇంటిల్లిపాదిని తప్పకుండా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
Also Read : Beauty Anshu Ambani :తాను మళ్లీ నటిస్తానని అనుకోలేదు