Sukumar: టాలీవుడ్ లో హీరోలు, దర్శకులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా సెలబ్రెటీ స్టాటస్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఈ కోవలో హీరో రామ్ చరణ్ భార్యగా ఉపాసన ముందుంటే… దర్శకుల జాబితాలో సుకుమార్ భార్య తబిత తరువాత స్థానంలో ఉంటుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా మారిన సుకుమార్… ఇటీవల కాలంలో సినీ ప్రముఖులకు సంబంధించిన ఏ ఫంక్షన్ కు వెళ్లినా వెంట తబిత కనిపిస్తున్నారు. ఒక్కోసారి సుకుమార్ తో కలిసి వస్తున్న ఈమె ఎవరబ్బా అని అభిమానులు అనుకునే స్థాయిలో ఆమె కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఆ ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటున్నారు.
Sukumar Wife..
అయితే సుకుమార్(Sukumar) భార్య తబిత ఇటీవల తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది. ఆమె జిమ్ లో కరసత్తులు చేస్తున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. జిమ్ లో ఆమె చేస్తున్న వర్కవుట్స్ కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సుకుమార్ పుష్ప-2 ది రూల్ షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్ లో నంబర్‌వన్ ప్లేస్ లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. కాగా ఈ పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
Also Read : Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన రష్యా ప్రతినిధుల బృందం !