Suhani Bhatnagar : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటి సుహానీ భట్నాగర్ కన్నుమూశారు. ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే. అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం దంగల్ లో ఈ చిన్నారి నటించింది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ రెండో కూతురుగా సుహాని భట్నాగర్ నటించింది. దంగల్ తర్వాత సుహానీ భట్నాగర్ ఫేమ్ పెరిగింది. ప్రస్తుతం ఆమె మరణ వార్త విని బాలీవుడ్ షాక్‌లో ఉంది. సుహానీ భట్నాగర్ ఫరీదాబాద్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. సుహాని దంగల్ సినిమాతో ఖ్యాతిని పెంచుకుంది, తన ఉల్లాసమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. గత కొన్ని రోజులుగా ఆమె ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
Suhani Bhatnagar No More
ఇటీవల ఓ ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. ఆమె చికిత్స కోసం మందులు కూడా తీసుకుంటుంది. అయితే, డ్రగ్ రియాక్షన్ కారణంగా ఆమె కాలు ఇన్ఫెక్షన్ అయినట్టు తెలుస్తుంది. ఆమె ఆరోగ్యం విషమించడంతో మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్‌లోని సెక్టార్ 15లోని అజ్లాండా శ్మశానవాటికలో సుహానీ భట్నాగర్(Suhani Bhatnagar) అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సుహాని భట్నాగర్ తన 11వ ఏట అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో బబితా ఫోగట్ గా కనిపించింది. ఆమె బాపు సేహత్ లియే తూ తో హనీకాక్ హై సినిమాలోని ప్రముఖ పాటలో కూడా కనిపించింది. సుహానీ భట్నాగర్ అమీర్ ఖాన్‌తో సహా చాలా మంది పెద్ద స్టార్స్‌తో కలిసి పనిచేశారు. అయితే అప్పటికె ఆమె ప్రజల దృష్టికి దూరమైంది. ఆమె సోషల్ మీడియాలో కూడా ఉంది, కానీ నవంబర్ 2021 నుంచి ఆమె యాక్టివ్‌గా లేదు. ఇప్పుడు ఆమె మరణ వార్త బాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.
Also Read : Allari Naresh : కొత్త టైటిల్ తో వస్తున్న అల్లరి నరేష్..టీజర్ తో నవ్వులే అంటున్న ఫ్యాన్స్