Jatadhara : పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది జటాధర(Jatadhara). ఇందులో ప్రధాన కథా నాయకుడిగా నటించనున్నారు సుధీర్ బాబు. హైదరాబాద్ లో చిత్ర బృందం, పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. జీ స్టూడియోస్ , ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత ప్రేరణ వి. అరోరా దీనిని నిర్మిస్తున్నారు.
Jatadhara Movie Updates
దర్శకులు హరీశ్ శంకర్, వెంకీ అట్లూరి, మోహన కృష్ణ ఇంద్రగంటి, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ , శిల్పా శిరోద్కర్ తో పాటు అనేక మంది ప్రముఖులు ఈ గ్రాండ్ ముహూర్త కార్యక్రమానికి హాజరయ్యారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టారు.
2016 బ్లాక్‌బస్టర్ హిందీ చిత్రం రుస్తుం తర్వాత జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా మధ్య రెండవ సహకార చిత్రం జటాధార. జటాధార అనేది ఉత్కంఠ భరితమైన, యాక్షన్-ప్యాక్డ్ , థ్రిల్లింగ్ మిస్టరీ రైడ్, ఇది ప్రేక్షకులకు ఉత్కంఠ భరితమైన సినిమా అనుభవాన్ని అందిస్తుంది.
డిమాండ్ ఉన్న పాత్ర కోసం నటుడు సుధీర్ బాబు కూడా కఠినమైన శిక్షణ పొందాడు. యాక్షన్ సన్నివేశాలలో తను మెప్పించేందుకు ట్రైనింగ్ తీసుకున్నాడు. జటాధర చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : Hero Pawan Kalyan Son Akhira :టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న అకిరా నందన్