Sudheer Babu: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన ఆర్ణ కథానాయికగా నటిస్తోంది. సీఏఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి వి. సెల్యులాయిడ్స్ పతాకంపై సునీల్ బలుసు ఈ సినిమానున నిర్మిస్తున్నారు. ఇప్పటికే సింహాభాగం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సుధీర్ బాబు(Sudheer Babu) గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తుంది.
Sudheer Babu Movie Updates
ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను ప్రారంభించిన చిత్ర యూనిట్… సోమవారం ‘మా నాన్న సూపర్‌హీరో’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ‘‘తండ్రీ కొడుకుల ప్రయాణమే ఈ చిత్ర కథ. ప్రేమ, అనుబంధాలకి నిజమైన అర్థాన్ని చాటుతూ మనసుల్ని కదిలించే ప్రయత్నమిది. తప్పకుండా ఇంటిల్లిపాదినీ అలరిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా సమీర్ కల్యాణి వ్యవహరిస్తుండగా జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Raghu Thatha: ఓటీటీలోనికి కీర్తి సురేశ్ కొత్త మూవీ ‘రఘుతాత’ !