Raja Saab : డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్(Raja Saab) మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ తర్వాత రొమాంటిక్ పాత్రలో నటిస్తున్న చిత్రం కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్కంఠతో ఏప్రిల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీ మేకర్స్ ఈ ఏడాదిలోనే రాజా సాబ్ ను విడుదల చేస్తామని ప్రకటించారు.
Hero Prabhas Raja Saab…
చిత్రానికి సంబంధించి అప్ డేట్స్ ఇస్తూ మరింత ఆసక్తిని రేపుతున్నారు. ఈ చిత్రానికి డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారు. తాజాగా బాబ్జీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్ కు తను అద్బుతమైన మ్యూజిక్ అందించాడు. తను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కెవ్వు కేక అనిపించేలా ఉంది.
తాజాగా రాజా సాబ్ మూవీ మాత్రం ఓ రేంజ్ లో ఉండ బోతోందంటూ ప్రకటించాడు మ్యూజిక్ డైరెక్టర్. ఇది అంచనాలకు మించి ఉంటుందన్నాడు. పాటలతో పాటు ఆకట్టుకునే సంగీతం కనువిందు చేయనుందని పేర్కొన్నాడు ఎస్ఎస్ థమన్. మరో వైపు ఇందుకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. మొత్తంగా మారుతి మూవీ అంటేనే ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రభాస్ ను పూర్తిగా లవర్ బాయ్ గా చూపించే ప్రయత్నం చేశాడు.
Also Read : Victory Venkatesh Movie : ఆ ఓటీటీలో రానున్న వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’