SSMB29 : పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) ఏది చేసినా అది సెన్సేషన్. తను ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు ఎస్ఎస్ఎంబీ29 మూవీతో. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా అవేవీ పట్టించుకోడు. తన దృష్టి అంతా సినిమాపైనే. ఎలాంటి విషయాల్లోనూ జోక్యం చేసుకోడు. కథ కోసం చాలా కష్ట పడతాడు. తాను అనుకున్నది వచ్చేంత దాకా వదలడు. ఇది ఆయన మనస్తత్వం. అందుకే చాలా మంది జక్కన్నతో మూవీ అంటే జడుసుకుంటారు. ఒకింత భయపడతారు. మరో వైపు సినిమా రంగానికి చెందిన ప్రతి ఒక్కరు రాజమౌళి సినిమాలో నటించేందుకు ఛాన్స్ వస్తే చాలాని అనుకుంటారు.
SSMB29 Movie Shooting Updates
ప్రస్తుతం జక్కన్న ఫోకస్ పెట్టాడు తన కొత్త చిత్రం షూటింగ్ పై. ఇది పూర్తిగా అడ్వెంచర్ తో కూడుకుని ఉన్నది. దీనికి కథ తయారు చేసి పెట్టాడు రాజ్యసభ సభ్యుడు, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఈ కథ ఈ దేశంలో ఏ నటుడు చేయలేడని, కేవలం ఒక్క ప్రిన్స్ మహేష్ బాబు మాత్రమే చేయగలడంటూ సంచలన ప్రకటన చేశాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పటి లాగే తన సోదరుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్న చిత్రానికి.
ఇంకా రిలీజ్ కాకుండానే ఈ సినిమా హక్కుల కోసం పెద్ద ఎత్తున సంస్థలు పోటీ పడుతున్నాయి. మొత్తం రూ. 2000 కోట్లకు పైగా వసూలు చేయాలని కంకణం కట్టుకున్నాడు జక్కన్న. సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ ఒడిశా అడవుల్లో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. వీటిని ప్రియాంక చోప్రా పంచుకోవడం విశేషం.
Also Read : Hero Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ తో మమితా బైజు కన్ ఫర్మ్