SS Rajamouli Praises : దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమిళ సినీ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు. దర్శకత్వ ప్రతిభ అద్భుతమని, అంతే కాకుండా సినిమాను తెరకెక్కించిన విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని పేర్కొన్నాడు.
SS Rajamouli Praises to Jawan Team
సోషల్ మీడియా వేదికగా జక్కన్న(SS Rajamouli) స్పందించాడు. పోరాట సన్నివేశాలు, షారుక్ ఖాన్ డైలాగులు, అందాల తార నయనతార నటన, దీపికా పదుకొనే స్పెషల్ అట్రాక్షన్ వెరసీ ప్రతి నాయకుడి గా విజయ్ సేతుపతి సూపర్ గా నటించారంటూ కితాబు ఇచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి.
సామాన్యంగా ఎవరినీ పొగడడు దర్శకుడు. కానీ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అట్లీ కుమార్ ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తాడు. ఇదిలా ఉండగా జవాన్ లో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఆయనకు జోడీగా నయనతార, దీపికా పదుకొనే నటించారు.
ప్రతి నాయకుడి పాత్రలో జీవించాడు విజయ్ సేతుపతి. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ర. 350 కోట్లను దాటేసింది. వరల్డ్ వైడ్ గా సక్సెస్ టాక్ తో దూసుకు పోతోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. మొత్తంగా జవాన్ షారుక్ కు మరిచి పోలేని చిత్రంగా మిగలనుంది.
Also Read : Akshay Kumar Praise : కింగ్ ఖాన్ కు తిరుగు లేదు